Sunday, April 28, 2024

ఏప్రిల్ తొలివారంలో రీ ఓపెన్ కానున్న స్కూళ్లు

కరోనా విజృంభణతో తెలంగాణలో మూతబడిన పాఠశాలలు త్వరలోనే తెరుచుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఏప్రిల్ తొలివారంలో పాఠశాలలు రీ ఓపెన్ అయ్యే అవకాశముందని సదరు పత్రిక తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం స్కూళ్ల మూసివేత కారణంగా ఆన్‌లైన్ తరగతులు నడుస్తుండటంతో వాటి వల్ల విద్యార్థులు గురవుతున్న అసౌకర్యాలపై టీచర్లు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది.

పదో తరగతి పరీక్షలను షెడ్యూల్ ప్రకారం మే 17 నుంచి 26 వరకు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా వచ్చే వారం నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు డెక్కన్ క్రానికల్ ఓ వార్తను ప్రచురించింది. ఇక ఇంటర్ పరీక్షలు యథావిధిగా మే 1 నుంచి జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement