Thursday, May 2, 2024

స‌త్య‌దేవ్ తాజా చిత్రం – గాడ్సే రిలీజ్ డేట్ ఫిక్స్

విభిన్న క‌థా చిత్రాల‌కి కేరాఫ్ అడ్ర‌స్ గా మారాడు యంగ్ హీరో స‌త్య‌దేవ్. కాగా ఆయ‌న ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. ఇక ఆయ‌న న‌టిస్తోన్న తాజా చిత్రం గాడ్సే మే 20న రిలీజ్ చేయ‌నున్నారు. సత్యదేవ్, గోపీ గణేశ్ తో సి. కళ్యాణ్ ‘గాడ్సే’ పేరుతో సినిమా తీస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీ. కాగా ఈ చిత్రంతో తమిళ నటి ఐశ్వర్య లక్ష్మి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని భిన్న‌మైన పాత్రలో సత్యదేవ్ న‌టిస్తున్నారు. నాగబాబు, నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, కిశోర్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించాడు.ఇక స‌త్య‌దేవ్ తెలుగు చిత్రాల‌తో పాటు హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘రామ్ సేతు’ మూవీలోనూ కీలక పాత్రలో న‌టిస్తున్నారు. స‌త్య‌దేవ్ చిత్రాలు అంటే యూత్ లో ఎన‌లేని క్రేజ్ ఉంది. మ‌రి ఈ చిత్రం స‌త్య‌దేవ్ కి విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి. ఈ పోస్ట‌ర్ లో స‌త్య‌దేవ్ రెండు చేతుల్లో రెండు గ‌న్స్ ఉన్నాయి. దాంతో పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement