Sunday, May 5, 2024

Prabhas: ‘రాధేశ్యామ్’ నుంచి మరో పాట.. ‘సంచారి’ సాంగ్ రిలీజ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంట నటిస్తున్న సినిమా ‘రాధే శ్యామ్’. బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్.. రాధేశ్యామ్ లో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టిజర్ సినిమాపై అంచనాలు పెంచింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్​ రిలీజ్​ అయింది. ‘సంచారి’ అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. ప్రభాస్​.. లవర్​బాయ్​గా, లైఫ్​ ఎంజాయ్​ చేస్తున్నట్లు కనిపించారు. పాటలో లొకేషన్స్​ ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమా ట్రైలర్​ను డిసెంబరు 23న విడుదల చేయన్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘రాధేశ్యామ్’ను యూవీ క్రియేషన్స్-గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. త‌మ అభిమాన హీరోని వెండితెర‌పై చూసి రెండుళ్లు దాటేయ‌డంతో డార్లింగ్‌ అభిమానులు రాధే శ్యామ్ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లకానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement