Monday, May 6, 2024

స‌మంత రికార్డ్ – దేశంలోనే మోస్ట్ పాపుల‌ర్ ఫిమేల్ స్టార్

ఇటీవ‌ల ఇండియాలో నిర్వ‌హించిన ఓ ప‌రిశోధ‌న‌లో దేశ వ్యాప్తంగా పేరుగాంచిన అనేక మంది తార‌ల‌ను అధిగ‌మించి స్టార్ హీరోయిన్ స‌మంత మొద‌టిస్థానంలో నిలిచింది. దేశంలోనే మోస్ట్‌ పాపుల‌ర్ ఫిమేల్ స్టార్‌గా నిలిచింది హీరోయిన్ స‌మంత‌. ఆలియా భ‌ట్‌, న‌య‌న‌తార‌, దీపికా ప‌డుకోనే లాంటి వాళ్లను కూడా ఆమె వెనక్కి నెట్టేసింది. క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత ప్రేక్ష‌కుల అభిరుచుల్లో వ‌చ్చిన మార్పును ఈ రీసెర్చ్ తెలియ‌జేసింది. మే నెలలో ఆర్‌మాక్స్ మీడియా నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో స‌మంత‌, ఆలియా, న‌య‌న‌తార‌, దీపికా ప‌డుకోనే, కాజ‌ల్ అగ‌ర్వాల్ మొద‌టి ఐదు స్థానాల్లో నిల‌వ‌గా, కీర్తి సురేశ్‌, క‌త్రినా కైఫ్‌, ర‌ష్మికా మంద‌న్న‌, పూజా హెగ్డే, అనుష్క శెట్టి త‌ర్వాత ఐదు స్థానాలు పొందారు.

త‌న అందం, విల‌క్ష‌ణ‌త‌, ప్ర‌తిభ‌తో మొత్తం ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్ధుల్ని చేస్తూ ఇండియాలోని టాప్ యాక్ట్రెస్‌ల‌లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకుంది స‌మంత‌. స‌మంత న‌టిగానే కాకుండా, ఒక సామాజిక సేవిక‌గా, వ్యాపార‌వేత్త‌గా, సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. మెస్మ‌రైజింగ్ లుక్స్‌, యాక్టింగ్ స్కిల్స్ ఆమెకు దేశ‌వ్యాప్తంగా వీరాభిమానుల‌ను సంపాదించి పెట్టాయి. ‘ఏ మాయ చేశావే’ మూవీలో చేసిన జెస్సీ నుంచి ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’లో చేసిన రాజీ దాకా ఆమె చేసిన ప్ర‌యాణం ఏ న‌టికైనా స్ఫూర్తిదాయ‌క‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement