Monday, May 6, 2024

పోలీస్ కానిస్టేబుల్ – అత‌ని కుమారైపై కాల్పులు జ‌రిపిన ఉగ్ర‌వాదులు – కానిస్టేబుల్ మృతి

ఓ పోలీస్ కానిస్టేబుల్ ని అత‌డి ఇంటి స‌మీపంలో విచ‌క్ష‌ణార‌హితంగా కాల్చిచంపారు ఉగ్ర‌వాదులు. అనంత‌రం అత‌డి ఏడేళ్ల కుమారైపై కూడా కాల్పులు జ‌రిపారు దీంతో ఆమెకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. శ్రీనగర్ జిల్లా శివార్లలోని సౌరా ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కానిస్టేబుల్ సైఫుల్లా ఖాద్రీ తన ఏడేళ్ల కుమార్తె ను ట్యూష‌న్ సెంట‌ర్ వ‌ద్ద‌కు వ‌ద‌లివెళ్లేందుకు ఇంటి నుంచి బ‌య‌లుదేరాడు. కొంత‌ దూరం వెళ్లే స‌రికి ఉగ్ర‌మూక దాడికి పాల్ప‌డింది. దీంతో అత‌డు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. కుమార్తె చేతికి కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. వెంట‌నే ఖాద్రీ, అతడి ఏడేళ్ల కుమార్తెను సమీపంలోని SKIMS ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఆయ‌న చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణించారు. అయితే కూతురుకు ప్ర‌స్తుతం ప్రాణాపాయం త‌ప్పింది. ఆమె చికిత్స పొందుతోంది. కానిస్టేబుల్ హత్య ప‌ట్ల ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కశ్మీర్ రేంజ్) విజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసు బృందాలను సమీప ప్రాంతాలకు పంపించారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కానిస్టేబుల్ సైఫుల్లా ఖాద్రీ ఈ నెలలో కాశ్మీర్‌లో హత్యకు గురైన మూడో పోలీసు. అంతకు ముందు మే 7వ తేదీన అంచర్ ప్రాంతానికి సమీపంలోని ఐవా బ్రిడ్జి వద్ద ఉగ్రవాదులు ఒక పోలీసును కాల్చిచంపగా, మే 13న పుల్వామా జిల్లాలో మరో పోలీసును కాల్చిచంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement