Monday, May 6, 2024

russia Ukraine war: నేడు మూడో విడత చర్చలు.. యుద్ధం ఆగేనా?

రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది . ఉద్రిక్త పరిస్థితుల మధ్యే ఉక్రెయిన్​-రష్యాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్​తో రెండు సార్లు చర్చలు జరిపిన రష్యా.. మరోసారి చర్చలకు సిద్ధమైంది. సోమవారం మూడో విడత చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్​పై రష్యా జరుపుతున్న భీకర దాడులను ప్రపంచ దేశాలే కాదు చాలా మంది రష్యన్లు కూడా తప్పుపట్టారు. యుద్ధాన్ని వెంటనే ఆపేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంపై రష్యా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు 4,300 మంది నిరసనకారులను అరెస్ట్​ చేసింది.

మరోవైపు సామాజిక మాధ్యమాలు కూడా రష్యా ఆంక్షల కారణంగా తమ కార్యకలాపాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. తమ యాప్​లో లైవ్​ స్ట్రీమింగ్​ సహా కొత్తగా వీడియోలను చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రముఖ సోషల్​ మీడియా యాప్​ టిక్​టాక్​ ప్రకటించింది. ఇటీవల ప్రభుత్వం ఫేక్​న్యూస్​ చట్టం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement