Wednesday, April 24, 2024

UP Elections 2022: యూపీలో చివరి దశ పోలింగ్ ప్రారంభం

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రారంభమైంది. 9 జిల్లాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు జరుగుతోంది. మొత్తం 613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరిగే ఈ ఓటింగ్​లో ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసి పరిధిలోని 10 స్థానాలు కూడా ఉన్నాయి. 2.6 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఎన్నికలతో తేల్చనున్నారు. ఈ పోలింగ్​తో ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలు పూర్తవుతాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడి కానున్నాయి.

2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 36 స్థానాల్లో విజయం సాధించగా, ఎస్పీ 11, బీఎస్పీ 6 చొప్పున గెలుపొందాయి. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement