Monday, May 20, 2024

బీహార్ వ్య‌క్తి డీమ్యాట్ అకౌంట్లోకి.. రూ.6వేల కోట్లు..

సాంకేతిక లోపాల కార‌ణంగా ఒక అకౌంట్‌లోకి వెళ్లాల్సిన డబ్బులు మరొకరి ఖాతాలోకి వెళ్లిపోతుంటాయి. అలా జ‌రిగిన‌ప్పుడు ఉద్యోగులు తమ తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటారు. లేదంటే … వినియోగదారుడి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటారు. అయితే ఇక్క‌డ అలా జ‌ర‌గ‌లేదు. అదేంటో చూద్దాం.. బీహార్ లోని ఓ వ్యక్తికి చెందిన డీమ్యాట్ అకౌంట్‌ లో ఏకంగా రూ.6 వేల కోట్లు జమయ్యాయాయి.

అయితే ఆ డబ్బు గురించి ఇప్పటివరకు ఎవ్వరూ సంప్రదించకపోవడం గమనార్హం. లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమాన్ కుమార్ అనే వ్యక్తి వారం రోజుల క్రితం తన డీ మ్యాట్ అకౌంట్‌ను చెక్ చేసుకుని షాకయ్యాడు. ఎందుకంటే అతని ఖాతాలో ఏకంగా రూ.6,833.42 కోట్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆ డబ్బులు అతని ఖాతాలోనే ఉన్నాయి. పొరపాటున ఇతని అకౌంట్‌లోకి డబ్బు జమ అయి ఉంటే ఈపాటికే ఎవరో ఒకరు ఫిర్యాదు చేసి ఉండేవారు. ఇప్పటివరకు ఎవరూ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఆ అమౌంట్ ఎవ‌ర‌ది.. ఇత‌ని ఖాతా అంత‌పెద్ద మొత్తం ఎందుకు ప‌డ్డాయ‌నే కోణంలో పోలీసులు పూర్తి సమాచారం సేకరించ‌నున్నారు. ఇంత‌పెద్ద అమౌంట్ త‌న డీమ్యాట్ ఖాతాలో ఎందుకు ప‌డ్డాయోన‌ని.. అత‌నికి కూడా ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని అంటున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement