Sunday, June 16, 2024

రైతు జ‌న్ ధ‌న్ ఖాతాలో రూ.15ల‌క్ష‌లు – రూ.9ల‌క్ష‌ల‌తో ఇళ్లు నిర్మాణం – కానీ ఆ న‌గ‌దు రైతుది కాద‌ట‌

ఓ రైతు జ‌న్ ధ‌న్ ఖాతాలో రూ.15ల‌క్ష‌లు ప‌డ్డాయి. దాంతో ఆ రైతు రూ.9ల‌క్ష‌లుపెట్టి ఇంటిని నిర్మించుకున్నాడు. దాంతో ఆ న‌గ‌దుని జ‌మ చేసింది ప్ర‌ధాని మోడీ అనుకుని ధ‌న్య‌వాదాలు చెబుతూ ప్ర‌ధాని కార్యాల‌యానికి ఈమొయిల్ పంపడంతో అస‌లు విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది. ఆ న‌గ‌దు ధ్యానేశ్వ‌ర్ గ్రామ‌పంచాయ‌తీద‌ని తెలిసింది. జిల్లా పరిషత్ నుంచి పింప్‌వాడీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీ ఖాతాకు బదిలీ అయ్యాయని, వెంటనే ఆ సొమ్ము తిరిగి చెల్లించాలని అధికారులు లేఖ‌లో తెలిపారు. ఐదు నెలల తర్వాత తేరుకున్న అధికారులు నిదానంగా ఈ లేఖ పంపడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ లేఖ చదివిన ధ్యానేశ్వర్‌కు నోటమాట పడిపోయినంత పనైంది. వెంటనే తేరుకుని ఖాతాలో మిగిలి ఉన్న రూ. 6 లక్షలను వారికి చెల్లించాడు. మిగతా రూ. 9 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక తల బద్దలుగొట్టుకుంటున్నాడు. ఈ త‌ప్పింది న‌గ‌దు పంపిన‌వారిదేగాని రైతుది కాద‌ని ప‌లువురు రైతుకి మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement