Friday, July 12, 2024

అన్నమయ్య కీర్తనలు : నీవు జగన్నాధుడవు

రాగం : భైరవి
నీవు జగన్నాధుడవు నేనొక జీవుడనింతే
నీవలె అనుభవించ నేనెంత వాడను|| ||నీవు జగన్నాధుడవు||

వైకుంఠ పద మేడ వడి గోర నెంతవాడ
యీకడ నీదాసుడనౌటిది చాలదా
చేకొని నీ సాకార చింతయేడ నేనేడ
పైకొని నీ డాగు మోచి బ్రతికి చాలదా|| ||నీవు జగన్నాధుడవు||

సొంపుల నీయానంద సుఖమేడ నేనేడ
పంపు శ్రీ వైష్ణవ సల్లాపన చాలదా
నింపుల వి జ్ఞాన మేడ నేదెలియనెంతవాడ
యింపుగా నీకథ వినుటిదియే చాలదా|| ||నీవు జగన్నాధుడవు||

కైవల్య మందు నీతో కాణాచియాడ నాకు
శ్రీ వేంకటాద్రి మీది సేవ చాలదా
యీవల శ్రీ వేంకటేశ నీవిచ్చిన విజ్ఞానమున
భావించి నిన్ను పొగడే భాగ్యమే చాలదా|| ||నీవు జగన్నాధుడవు||

Advertisement

తాజా వార్తలు

Advertisement