Saturday, June 29, 2024

Mahabubnagar – జిల్లా కలెక్టర్ గా విజయేందిర బాధ్యతలు

మహబూబ్ నగర్, జూన్ 16 (ప్రభ న్యూస్):మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా బి. విజయేందిర బోయి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.జిల్లాకు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కు అర్.బి.అతిథి గృహం వద్ద పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు,అదనపు ఎస్.పి.రాములు,అర్.డి. ఓ నవీన్ స్వాగతం పలికారు.అనంతరం నేరుగా జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ను ఛాంబర్లో అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఎస్.మోహన్ రావు,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కృష్ణ,డి.పి.అర్. ఓ శ్రీనివాస్,షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ డి.డి.పాండు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ భాస్కర్,కలెక్టరేట్ పరిపాలన అధికారి శంకర్,రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఏ.నట రాజ్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మర్యాదపూర్వకంగా పూల బొకేలు అందించి సాదరంగా కలిశారు.

అనంతరం నూతన కలెక్టర్ తహశీల్దార్ లతో టెలీ కాన్పరిన్స్ నిర్వహించారు.ధరణి పెండింగ్ దరఖాస్తులు,సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ఏర్పాట్ల పై సమీక్షించి సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement