Friday, May 3, 2024

వైర‌ల్ గా #RRRMassBegins వీడియోలు – విదేశాల్లో కూడా

ఈ నెల 25న ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. #RRRMassBegins పేరుతో సోష‌ల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. భార‌త్‌లోనే కాదు విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో తెలిపేలా ఓ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. కెన‌డా అభిమానులు ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్ పేర్ల‌ను కార్ల‌తో రూపొందించారు. ఎన్టీఆర్‌కు వారు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదా పడింది. క‌రోనా త‌గ్గ‌డంతో ఈ నెల 25న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి రూపొందిస్తోన్న సినిమా కావ‌డంతో దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దానికి తోడు ఎన్టీఆర్‌, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో న‌టించారు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement