Monday, April 29, 2024

Rice Millers Scam – స‌ర్కార్ కే టోక‌రా … త‌రుగు పేరుతో రూ.1200 కోట్లు ఎగ‌నామం ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో :

అన్నం పెట్టిన చేతికే సున్నం పెట్టారన్న సామెతను తలపించేలా రా ష్ట్రంలో రైస్‌ మిల్లర్ల వ్యవహారం మితిమీరుతోంది. పైసా ఖర్చు లేకుండా ధాన్యాన్ని అప్పగిస్తే.. తిరిగి బియ్యం ఇవ్వడంలో అనేక షరతులు పెట్టి అందినకాడికి దోచు కుతింటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తున్న కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎం ఆర్‌)పై తరుగు పేరుతో టోకరా విధిస్తున్నారు. ధాన్యాన్ని బియ్యంగా మార్చడం, తిరిగి ప్రభు త్వానికి సరఫరా చేయ్యడం, తుదకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా కేంద్ర ప్రభు త్వానికి లెవీ రూపంలో అందించడం.. లాం టి ప్రక్రియలో కీలక భూమిక పోషిస్తున్న మిల్లర్లు.. ఇక ప్రత్యామ్నాయం తామేనన్న ధీమాతో దురుసుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఇచ్చిన సీఎంఆర్‌ సరుకును ఈ ఏడాది ప్ర భుత్వం సేకరిస్తోంది. ఇచ్చిన తర్వాత గరిష్టంగా 6 నెలల లోపు ప్రభుత్వం తిరిగి తీసుకోవాల్సి ఉంటు ంది. సరైన నిల్వ సామర్థ్యం లేని కారణంగా ప్రభుత్వం తరఫున జరిగిన ఆలస్యానికి తరుగు పేరుతో మిల్లర్లు సుమారు రూ.1200 కోట్లు ఎగనామం పెట్టినట్లు సంబంధిత అధికారుల ద్వారా సమాచారం అందింది. సొమ్ము ప్రభుత్వానిది.. సోకు రైస్‌ మిల్లర్లది? అన్నట్లు వ్యవహారం కొనసాగుతోంది.

పౌర సరఫరా సంస్థ కొన్న సరుకంతా మిల్లులకే అప్పగిస్తున్న నేపథ్యంలో గరిష్ట నిల్వ సమయం దాటుతుండడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపి స్తోంది. సరుకు నిల్వ సమయంలో ముక్కిపోయిన, పందికొక్కులు తిన్న ధాన్యానికి తరుగు పరిహారం ప్ర భుత్వమే చెల్లించాలన్న డిమాండ్‌ను మిల్లర్లు బలవం తంగా అమలు చేయిస్తున్నారు. ప్రతి క్వింటాలుకు 67 కిలోల బియ్యం ఇవ్వాల్సిన నిబంధన గాలికి వదిలి గత ఏడాది సీఎంఆర్‌ కోటాలో 50 నుంచి 55 కిలోలు మాత్రమే అప్పగిం చా రు. కొన్ని సందర్భాల్లో వాస్తవ ంగా నష్టం జరు గుతున్నప్పటికీ.. అనేక మంది మిల్లర్లు అదే విధానాన్ని అనుసరిస్తు ండడంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అప్పులు చేసి కొన్న ధా న్యాన్ని మిల్లర్లకు ఇచ్చి, వారి ఆగడాలతో మరి న్ని అప్పులు పెరుగుతు న్నాయన్న ఆందోళన అధికార యంత్రాంగంలో కినిపిస్తోంది. చిన్నవి.. పెద్దవి కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3600లకు పైగా రైస్‌ మిల్లులు ఉన్నాయి. అధిక సామర్థ్యం కలిగిన మిల్లర్లంతా కుమ్మక్కై సీఎంఆర్‌ ఇవ్వడంలో సిందికేట్‌ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.

అనేక చోట్ల సీఎంఆర్‌ కోసమే మిల్లుల స్థాపన?
రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న సోయాలో ఇక్కడే 80 శాతం వరకు ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చోట రైస్‌ మిల్లులు నెలకొల్ప టమే సీఎంఆర్‌ కోసమని స్పష్టమవుతోంది. పైగా రైస్‌మిల్‌ ఇండస్ట్రీలో ఉన్నంత లాభం ఏ ఇండ స్ట్రీలో లేదని గ్రహించిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతి నిధులు, దాదాపు అన్ని పార్టీల నేతలు.. ఇటీ-వల కాలంలో పెద్ద సంఖ్యలో రైస్‌మిల్లులు స్థాపిం చడం అక్రమాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రభుత్వ మి చ్చిన ధాన్యం అమ్ముకో వటం, వీలైనపు డు పీడీఎస్‌ బియ్యం కొని రీ- సైక్లింగ్‌ చేసి ప్రభుత్వానికి అప్ప గించటం సులువైపో యింది. జిల్లాస్థా యి నుంచి రాష్ట్రస్థాయి వరకు అందరు అధికారుల సహకారం ఉండటంతో కేటాయింపులు చకచకా జరిగి పోతున్నా యి. ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే కాదు.. ప్రతి జిల్లాల్లోనూ కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ వ్యవహారం అంతా ఒకే తరహాలో జరుగు తోంది.

ఇదిలా ఉండగా… 2022 వానాకాలం సీజన్‌లో రైస్‌మి ల్లులకు ప్రభుత్వం అప్పగించిన లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తిరిగి పొందడంలో అనేక కష్ట, నష్టాలను ఎదుర్కొనవలసి వస్తోంది. 67 శాతం రికవరీ చొప్పున మెట్రిక్‌ టన్ను బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ ఇంతవరకు ఒక్క బియ్యం గింజ కూడా ఎఫ్‌సీఐకి డెలివరీ ఇవ్వలేదు. ఈ బియ్యం విలువ వేల కోట్లలో- ఉంటు-ంది. ఇప్పుడీ భారమంతా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థపై పడుతోంది. ఖరీఫ్‌ బకాయిలు ఉండగానే తర్వాత వచ్చిన యాస ంగి సీజన్‌లో మళ్ళీ లక్షలాది మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి తప్పనిసరి పరిస్థితుల్లో రైస్‌మిల్లులకే అలా-టె-్మంట్‌ చేశారు. ఈ ధాన్యాన్ని మిల్లింగ్‌చేసి సకా లంలో బియ్యం ఇవ్వాలి. కానీ ఇంతవరకు మిల్లింగే ప్రా రంభించ లేదు. ప్రభుత్వం కేటాయించిన సరుకులో వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సదరు మిల్లుల్లో కనిపిం చటంలేదని విజిలెన్స్‌ అధికారులు రిపోర్టు చేసినా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. సీఎంఆర్‌ బియ్యం నిల్వలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపో యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement