Friday, April 26, 2024

Breaking: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. రేవంత్ ఇంటి చుట్టుపక్కల పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. రేవంత్ ఇంటి వైపు వెళ్లే మార్గాలను మూసివేశారు. రేవంత్ ఇంటి వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తోన్నారు. ఈ పరిణామాల క్రమంలో రేవంత్ ఇంటి వద్ద టెన్షన్ వాతారణం నెలకొంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ స్టూడెంట్స్ నిరసన దీక్షకు ప్లాన్ చేశారు.

అయితే విద్యార్థుల దీక్షకు అనుమతి లేదని చెబుతున్న పోలీసులు.. దీక్షలు చేస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిరుద్యోగ మహాదీక్షకు విద్యార్థులు పిలుపునిచ్చారు. ఈ దీక్షలో పాల్గొనాల్సిందిగా రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. దీంతో రేవంత్ రెడ్డి హాజరయ్యేందుకు సిద్దమైన క్రమంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement