Sunday, April 28, 2024

కరోనా బాధితుల కోసం కోటి రూపాయలు విరాళం ఇచ్చిన రేవంత్

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా ఆరువేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులునమోదు అయ్యాయి. కరోనా సృష్టిస్తున్న విలయానికి ప్రజలు కకావికలమవుతున్నారు. కనీసం ఆసుపత్రిలో చేరి ప్రాణాలు నిలుపుకుందామా అంటే బెడ్స్‌ కొరత వేధిస్తోంది. కరోనా పేషెంట్లు, రోగుల బంధువులతో ప్రభుత్వ, ప్రైటేట్ ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్ కొరత ప్రజల ప్రాణాలు హరిస్తోంది. గంటగంటకు రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక ప్రైవేట ఆస్పత్రల్లో బాధిలులు చేరుతున్నారు. అయితే, డబ్బులు కడితేనే చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా బాధితుల కోసం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని బొల్లారంలో ఉన్న ఆస్పత్రిలో కొవిడ్ బాధితుల కోసం బెడ్స్, ఆక్సిజన్ ను ఏర్పాటు చేశారు. పేదల కోసం వీటిని ఏర్పాటు చేశానని ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పారు.  

https://youtu.be/Dt-6ZilrxQI
Advertisement

తాజా వార్తలు

Advertisement