Monday, April 29, 2024

హైదరాబాద్ లో అందుబాటులోకి.. రిలయన్స్ 5జీ సేవలు

ఇకపై 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ లో కూడా రిలయన్స్ 5జీ సేవలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, వారణాసి, కోల్ కతా, ఢిల్లీ, నట్వారాలకు జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పట్టణాల్లోని జియో కస్టమర్లు తమ మై జియో యాప్ లో ఇన్విటేషన్ వచ్చిన తర్వాత 5జీ నెట్ వర్క్ కు కనెక్ట్ కావొచ్చని జియో ప్రకటించింది. 2023 దీపావళికి దేశవ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ ను చేరువ చేస్తామని జియో లోగడే ప్రకటించడం గమనార్హం. పోటీ సంస్థ భారతీ ఎయిర్ టెల్ సైతం హైదరాబాద్ పరిధిలో 5జీ సేవలను ఇప్పటికే ప్రారంభించడం తెలిసిందే.  జియో యూజర్లు 5జీ ఫోన్ కలిగి ఉంటే 5జీ నెట్ కు అనుసంధానం కావచ్చు. ఎంపిక చేసిన కస్టమర్లకు అన్ లిమిటెడ్ గా 5జీ డేటాను జియో ప్రస్తుతం ఆఫర్ చేస్తోంది. 4జీని సైతం మొదట్లో ఉచితంగా ఇచ్చి యూజర్లను ఆకర్షించడం తెలిసిందే. జియో యూజర్లకు ఎస్ఎంఎస్ లేదా మైజియో యాప్ లో నోటిఫికేషన్ రూపంలో ఇన్విటేషన్ వస్తుంది. అప్పుడే 5జీ నెట్ వర్క్ కు అనుసంధానం కాగలరు.  నోటిఫికేషన్ అందిన వారు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. మొబైల్ నెట్ వర్క్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత జియో సిమ్ సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రిఫర్డ్ నెట్ వర్క్ టైప్ ను ట్యాప్ చేయాలి. అక్కడ 3జీ, 4జీ, 5జీ కనిపిస్తాయి. 5జీ నెట్ వర్క్ ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో 5జీ నెట్ వర్క్ కు మీ ఫోన్ కనెక్ట్ అయిపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement