Thursday, May 2, 2024

ఏపీలో జూన్ 20 నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో నిబంధనలు, ఆంక్షలకు రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్‌పై అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం జరిపారు.

ఏపీలో జూన్ 30 వరకు కర్ఫ్యూ నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇచ్చింది. సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉండటంతో తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపులకు అనుమతి ఇచ్చింది. ఈనెల 21 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement