Friday, April 19, 2024

పుష్ప కి ముహూర్తం ఫిక్స్ చేసిన సుకుమార్ ?

కరోనా మహమ్మారి కారణంగా చాలా వరకు సినిమా షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఒక్కో సినిమా షూటింగ్ లు స్టార్ట్ అవుతున్నాయి. అందులో భాగంగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. జూలై 5 నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టడానికి డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట.

మిగిలి ఉన్న షూటింగ్ హైదరాబాద్ లో మొదట జరుగబోతుంది. హైదరాబాదులో షూటింగ్ అయిపోయిన తర్వాత యాక్షన్ సీక్వెన్స్ కోసం థాయిలాండ్ లేదా చైనా వెళ్లనున్నారట చిత్ర యూనిట్. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement