Friday, May 10, 2024

ADR Report: టాప్-3లో నిలిచిన తెలుగు ప్రాంతీయ పార్టీలు!

దేశవ్యాప్తంగా అత్యధిక విరాళాలు సేక‌రించిన ప్రాంతీయ పార్టీలలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలు టాప్ లో నిలిచాయి. మొద‌టి స్థానంలో తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ నిలిచింది. TRSకు విరాళాల‌లో రూపంలో రూ. 89 కోట్లు వచ్చాయి. ఆంధ్రప్ర‌దేశ్ లో ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన టీడీపీ రెండో స్థానంలో ఉంది. టీడీపీకి విరాళాల రూపంలో రూ. 81 కోట్లు వ‌చ్చాయి. అలాగే మూడో స్థానంలో ఏపీలోని అధికార వైఎస్ఆర్‌సీపీ ఉంది. వైసీపీ కి విరాళాల రూపం లో రూ. 74 కోట్లు వ‌చ్చాయి. ఈ మేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) కంట్రిబ్యూషన్‌, ఆడిట్‌ నివేదిక పేర్కొంది.  ఏడీఆర్‌ నివేదిక ఆధారంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 53 పార్టీల ఆదాయాలను విశ్లేషించింది. 2019-20 సంవత్సరంలో 25 ప్రాంతీయ పార్టీలకు మొత్తం రూ.803.24 కోట్ల ఆదాయం రాగా… ఇందులో రూ.445.77 కోట్లు తెలియని మార్గాల నుంచి వచ్చాయని ఆయా పార్టీలు చూపించాయి.

తెలియని మార్గాల నుంచి విరాళాల్లో టీఆర్ఎస్‌కు దేశంలోనే అత్యధికంగా రూ.89.158 కోట్లు రాగా.. టీడీపీ రూ.81.694 కోట్లు, వైసీపీ రూ.74.75 కోట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో బిజూ జనతాదళ్‌ రూ.50.58 కోట్లు, తమిళనాడులోకి డీఎంకేకి రూ.45.5 కోట్లు, మహరాష్ట్రలోని శివసేనకి రూ.42.79కోట్లు, కర్ణాటకలోని జేడీ(ఎస్‌)కి రూ.18.55 కోట్లు, జేడీయూ రూ.13.04కోట్లు, సమాజ్ వాది పార్టీకి రూ.10.84 కోట్లు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. తెలంగాణలో వరి కోసం పోరు

Advertisement

తాజా వార్తలు

Advertisement