Sunday, April 28, 2024

బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. తెలంగాణలో వరి కోసం పోరు

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల అంశం రాజకీయంగా వేడి పెంచుతోంది. బీజేపీ, టీఆర్ఎస్‌ మధ్య వరిపై మొదలైన మాటల యుద్ధం.. సవాళ్లు విసురుకునే స్థాయికి వెళ్లింది. ఈ క్రమంలో నిన్న బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎదురు దాడికి సిద్ధమైంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా అధికార టీఆర్ఎస్ పార్టీ పోరుకు చేయనుంది.

కేంద్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ఆందోళనలో కార్యకర్తలు పాల్గొననున్నారు.

మరోవైపు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద కూడా టీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేయనుంది. రాష్ట్రం పట్ల కేంద్రంలోని మోదీ సర్కార్ వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. పంజాబ్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకు కేంద్రాన్ని వెంటాడుతామని ఇప్పటివకే సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: Breaking: కావాల‌నే కేంద్రాన్ని బ‌ద్నాం చేస్తున్నారు.. వాట‌ర్ వార్‌పై స్పందించిన షెకావ‌త్‌..

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement