Thursday, May 2, 2024

తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ..

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.. ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని.. రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కుమ్రంభీం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, అర్భన్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement