Friday, May 17, 2024

నోబెల్ గ్ర‌హీత అమ‌ర్త్య‌సేన్ కి క‌రోనా- ఇంటిలో చికిత్స‌

రోజు రోజుకి క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ప‌లువురు సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డుతున్నారు. కాగా నోబెల్ గ్రహీత‌..ప్ర‌ముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌కు కరోనా సోకింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంద‌ని స‌మాచారం. వైద్యుల సలహా మేరకు శాంతినికేతన్‌లోని తన ఇంటిలో ఐసోలేష‌న్ ఉండి చికిత్స పొందుతున్నారు. జూలై 1న శాంతినికేతన్‌లోని తన ఇంటికి అమర్త్యసేన్ వచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల తర్వాత ఆయ‌న ఆరోగ్యం బాగులేద‌ని వార్త‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైద్యులను సంప్రదించార‌నీ, క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, పరీక్షలో అమ‌ర్త్య‌సేన్ కు కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కాగా అమర్త్యసేన్‌ శనివారం వారి శాంతినికేతన్ ఇంటి నుండి కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. అమర్త్యసేన్ కోల్‌కతాలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. జులై 10న లండన్ వెళ్లాల్సి ఉండగా.. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా వాటన్నింటినీ రద్దు చేశారు. కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం, అమర్త్యసేన్ ఇప్పుడు శాంతినికేతన్‌లోని తన ఇంట్లో ఉన్నారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. వైద్యుల సలహా మేరకు నడుచుకుంటున్నారు. అయితే అతడికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష ఇంకా జరగలేద‌ని స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement