Sunday, November 28, 2021

టిఆర్ ఎస్ కి ర‌వీంద‌ర్ సింగ్ రాజీనామా చేయ‌నున్నారా..

టీఆర్ ఎస్ కి ఊహించ‌ని షాక్ త‌గిలింది..క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్,టిఆర్ ఎస్ కార్పొరేట‌ర్ ర‌వీంద‌ర్ సింగ్ సంచ‌ల‌న కామెంట్స్ ని చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్నవారు మా పార్టీకి చెందిన వాళ్ళు కాదని తెల‌ప‌డం విశేషం. టీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్ళు బరిలో ఉంటే రేపే విత్ డ్రా చేసుకుంటానని… ముప్పై ఏండ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన అనుభవం ఉంద‌న్నారు. ప్రజా క్షేత్రంలో ఇంకా సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నానని చెప్పారు.కాగా రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రవిందర్ సింగ్ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ఆయన రేపు టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసే చాన్స్‌ ఉన్నట్లు స‌మాచారం. ఒక వేళ రవీంద‌ర్ సింగ్ టీఆర్‌ఎస్‌ కి రాజీనామా చేస్తే.. గంగులకు షాక్‌ తప్పదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News