Friday, April 19, 2024

Breaking: మండలి రద్దు నిర్ణయం వెనక్కి.. ఆమోదించిన ఏపీ అసెంబ్లీ

ఏపీ మండలి రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. శాసనమండలి రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు అసెంబ్లీ ముందకు మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మండలి రద్దు కోసం గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి సభలో ప్రకటించారు. శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ తీర్మానం చేశారు. మంత్రి ప్రవేశపెట్టిన మండలి పునరుద్ధరణ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు.

గత ఏడాది జనవరిలో ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం తెచ్చారు. రద్దు తీర్మానాన్ని జనవరి 27న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపగా, గత 22 నెలలుగా అది కేంద్రం వద్దే పెండింగ్ లో ఉండిపోయింది. దాంతో శాసనమండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడింది. అయితే, తాజాగా ప్రభుత్వం మండలిని యథావిధిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement