Friday, April 26, 2024

Breaking | హైద‌రాబాద్ శివారులో రేవ్ పార్టీ, మెరుపుదాడి చేసిన పోలీసులు.. నిందితుల అరెస్టు

హైద‌రాబాద్ శివారులో నిర్వ‌హించిన రేవ్ పార్టీపై పోలీసులు దాడులు నిర్వ‌హించారు. హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌ల ప‌రిధిలోని ప‌సుమాముల‌లో రేవ్ పార్టీ నిర్వ‌హించిన‌ట్లు పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. ఓ బ‌ర్త్ డే పార్టీ సంద‌ర్భంగా ఆ పార్టీలో గంజాయి వాడిన‌ట్లు పోలీసుల‌కు తెలిసింది. దీంతో ఆ రేవ్ పార్టీపై పోలీసులు మెరుపుదాడి చేశారు.

29 మంది యువ‌కులు, న‌లుగురు అమ్మాయిల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా గంజాయి, 11 కార్లు, ఒక బైక్‌, 28 సెల్‌ఫోన్ల‌ను పోలీసులు సీజ్ చేశారు. అయితే జితిన్ సుభాష్ అనే యువ‌కుడి బ‌ర్త్ డే సంద‌ర్భంగా పార్టీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో పాల్గొన్న యువ‌తీ యువ‌కులు అంద‌రూ సీబీఐటీ, ఎంజీఐటీకి చెందిన విద్యార్థుల‌ని స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement