Thursday, May 16, 2024

కిలో టీ పౌడర్​కి లక్ష రూపాయలు.. అస్సాం ఆర్గానిక్​ టీ ఆకులకు ఫుల్​ డిమాండ్​

మార్నింగ్​ లేవగానే ఒక వేడి వేడి చాయ్​ గొంతులోకి వెళ్లనిదే ఆ రోజు మొదలు కాదు. అట్లా రోజంతా బీజీ బిజీగా ఉన్నా.. ఎన్నోసార్లు హాట్​ హాట్​ టీని ఆస్వాదిస్తూ రీఫ్రెష్​ అవుతుంటారు చాలామంది. అట్లాంటిది అస్సాం టీ అంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ, ఈ టీ ముచ్చట వింటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే వంద గ్రాముల టీ పొడి దాదాపు 100 రూపాయల నుంచి మొదలువుతుంది. ఈ లెక్కన కిలో టీపొడి దాదాపు 1000 రూపాయలు ఉండొచ్చు. కానీ, ఈ టీ ఆకులు మాత్రం కిలో లక్ష రూపాయలకు అమ్ముడు పోయాయి. అదే దీని స్పెషాలిటీ అంటున్నారు టీ ఎస్టేట్​ నిర్వాహకులు.

అది అస్సాంలోని పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్.. దాని యజమాని రాఖీ దత్తా సైకియా ఈ ఏడాది ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సారి తన టీ ఎస్టేట్​ నుంచి భారీ బేరమే తగిలింది. వారి అరుదైన రకానికి చెందిన టీ ఆకులకు కిలోకి ఏకంగా లక్ష రూపాయల ధర పలకడమే దీనికి కారణం. “మేము ఈ అరుదైన రకం టీని కేవలం ఒక కేజీ మాత్రమే ఉత్పత్తి చేశాం. చరిత్ర సృష్టించిన ఈ కొత్త రికార్డ్ బ్రేకింగ్ ధర పట్ల సంతోషంగా ఉన్నాం. అయితే ఈ రేటు అస్సాం టీ పరిశ్రమ కోల్పోతున్న కీర్తిని మళ్లీ నిలబెడుతుందన్న నమ్మకం ఉంది..” అని టీ ఎస్టేట్​ నిర్వాహకురాలు రాఖీ దత్తా అన్నారు.

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన పభోజన్ గోల్డ్ టీ అనే అరుదైన రకం ఆర్గానిక్ టీ ఇవ్వాల (సోమవారం) జోర్హాట్‌లోని వేలం కేంద్రం ద్వారా కిలోగ్రాముకు 1 లక్ష రూపాయలకు విక్రయించబడింది. ఈ ఏడాది ఇదే అత్యధిక రేటు అని అక్కడి అధికారులు అంటున్నారు. పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్ విక్రయించిన టీని అస్సాంకు చెందిన టీ బ్రాండ్ అయిన ఈసా టీ కొనుగోలు చేసిందని జోర్హాట్ టీ వేలం కేంద్రం (JTAC) అధికారి తెలిపారు.

- Advertisement -

పభోజన్ గోల్డ్ టీ ఒక ప్రకాశవంతమైన పసుపు వర్ణాన్ని కలిగి ఉంటుంది. ఈ టీ ఎస్టేట్ నుండి తీసిన సెకండ్ ఫ్లష్ చిట్కాల(ఆకుల) నుండి తయారు చేశారు. ఈ చిట్కాలు బంగారు రంగులోకి మారుతాయి. పానీయానికి మంచి రంగును వచ్చేలా చేస్తాయి . తమ వినియోగదారులకు అస్సాం నుండి అత్యుత్తమ టీ మిశ్రమాలను అందించడానికి ఈ వెరైటీ టీ రకం వారికి సహాయపడుతుందని ఈసాహ్ టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిజిత్ శర్మ అన్నారు.

ఈ టీ రకం చాలా అరుదుగా దొరుకుతుంది. టీ వ్యసనపరులకు ఇది ఒక కప్పులో ఎంతో మంచి అనుభవాన్ని ఇస్తుంది. మా కస్టమర్‌లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. ఈ రకం రుచి, విలువను అర్థం చేసుకుంటారు. వారికి అసలైన అస్సాం టీ రుచులను అందించాలనే మా మిషన్‌ను కొనసాగిస్తున్నాం. అందుకు  మేము సంతోషిస్తున్నాం” అని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement