Thursday, May 2, 2024

రామారావు ఆన్ డ్యూటీ – ఏప్రిల్ 10న లిరిక‌ల్ సాంగ్

ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ తెర‌కెక్కిస్తోన్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీలో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా న‌టిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఫస్ట్ సింగల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది.ఈ చిత్రంలోని ‘బుల్‌బుల్ త‌రంగ్’ అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్ వీడియోను ఏప్రిల్10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాట ర‌వితేజ‌, ర‌జిషా విజ‌యన్ మ‌ధ్య సాగే లవ్‌సాంగ్‌గా ఉన్న‌ట్లు తెలుస్తుంది. పోస్ట‌ర్‌లో ర‌వితేజ‌, రజీషాలు కండువ‌ను మెడ‌పై వేసుకొని ఒక‌రినొక‌రు చూసుకుంటున్న‌ట్లు పోస్ట‌ర్‌లో ఉంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌషిక్ మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. చాలా కాలం త‌ర్వాత సీనియ‌ర్ న‌టుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. శ్రీ ల‌క్ష్మివెంక‌టేశ్వ‌రా సినిమాస్, ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సుధాక‌ర్ చెరుకూరితో కలిసి ర‌వితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రంలో ర‌వితేజ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement