Sunday, April 28, 2024

పోలీస్ పోస్టుల ఎంపిక పరీక్షకు ఉచిత శిక్షణ..

ఉమ్మడి రంగారెడ్డి, ప్రభన్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్న పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామకం కొరకు ఉత్సాహవంతులు, అర్హులైన వంద (100) మంది షెడ్యూల్డ్‌ కులాల యువతీ యువకులకు జిల్లా పరిధిలోని పోలీసు శిక్షణా సంస్థలలో రెండు నెలల పాటు ఉచిత ప్రీ ఎక్జామినేషన్‌ కోచింగ్‌ ను రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ తెలిపారు. పోలీసు శాక, షెడ్యూల్‌ కులాల సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఉద్యోగాల శిక్షణ కొరకు ఆయా అభ్యర్థుల గ్రాడ్యుయేషన్‌లోని మార్కులు, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకై ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా మెరిట్‌ పొందిన వారిని, ఆయా ఉద్యోగాలకు తగిన శారీరక దారుఢ్యం కలిగిన వారిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.

ఈ కోచింగ్‌ కొరకు ఎంపిక అయిన అభ్యర్థులకు భోజనం, వసతితో కూడిన శారీరక, వ్రాత పరీక్షలకు తగిన శిక్షణ పోలీసు శిక్షణా సంస్థలో ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సాహవంతులైన, ఆసక్తి కలిగిన రంగారెడ్డి జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాల యువతీ యువకులు ఈ నెల 7వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకీవాలని సూచించారు.. పూర్తి వివరాలకు వివరాలకు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ డీడీ శ్రీధర్‌, సుచరితా రాయ్‌, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ సుచరితను (9000919109) సంప్రదించాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement