Saturday, May 4, 2024

KONDA: నక్సలైట్ గా మారిన రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నక్సలైట్ గా కొత్త అవతారం ఎత్తారు. చేతిలో తుపాకీ పట్టుకుని, ‘కొండా’ పార్టీలో ఆర్జీవీ హల్ చల్ చేశారు. మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళి దంపతుల జీవిత కథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ ‘కొండా’ అనే సినిమా తెరకెక్కిస్తున్నవిషయం తెలిసిందే. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. కంపెనీ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తయింది.

ఈ సందర్భంగా వ‌రంగ‌ల్‌లో షూటింగ్ ముగింపు వేడుక జరిగింది. దీనికి కొండా మురళి, సురేఖ దంపతులు హాజరయ్యారు. ఈ పార్టీకి రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గెట‌ప్‌లో వచ్చారు. అంతేకాదు కొండా కేక్ ని కత్తితో కట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement