Sunday, April 28, 2024

Acharya: రామ్ చరణ్ కొత్త లూక్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి, రాచ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… రామ్ చరణ్ పక్కన పూజా హెగ్డే నటిస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీం ఫ్యాన్స్ కోసం ఓ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ లో రామ్‌ చరణ్‌ చాలా కూల్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో హిట్ అందుకున్న రామ్ చరణ్.. ఆచార్యతో దానిని కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్‌ 29 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement