Monday, May 6, 2024

కోలుకున్న సూపర్ స్టార్.. ఆస్పత్రి నుంచి రజిని డిశ్చార్జి

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. స్వల్ప అస్వస్థతకు గురైన రజనీ నాలుగు రోజుల క్రితం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. రజనీని పరిశీలించిన వైద్యులు ఆయన మెదడులోని రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నట్టు గుర్తించి శస్త్రచికిత్స చేసి తొలగించారు.  ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి నిన్న డిశ్చార్జ్ అయ్యారు. తాను డిశ్చార్జ్ అయిన విషయాన్ని అభిమానులకు రజిని ద్వారా తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement