Tuesday, May 21, 2024

నేటి రాశి ప్రభ (1-11-21)

మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ధనలబ్ధి. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. కళాకారులకు సన్మానాలు. ఆస్తివివాదాలు తీరతాయి.

మిథునం: రాబడికంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు-. బంధువులతో మాట పట్టింపులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. దూర ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు.

కర్కాటకం: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ఇంటా బయటా ఒత్తిడులు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాబడి పెరుగుతుంది. వస్తు,వస్త్ర లాభాలు. ఆస్తుల వివాదాలు తీరతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

- Advertisement -

కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. పనులుచకచకా సాగుతాయి.

తుల: కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు, ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.

వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో జాప్యం. ఆలయదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో
కొద్దిపాటి చికాకులు.

ధనుస్సు: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కుటు-ంబ సమస్యలు తీరతాయి.

మకరం: కుటు-ంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో కొన్ని సమస్యలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్న కార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు ప్రోత్సాహ కరంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

మీనం: అనుకోని ధన వ్యయం. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. బంధువులను కలుసుకుంటారు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శారీరక రుగ్మతలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement