Saturday, May 4, 2024

100మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2023లో రాజ‌మౌళి.. షారుక్

ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు పాట‌కి ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అవార్డు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ రీసెంట్‌గా హిందీ యాక్షన్ థ్రిల్లర్ పఠాన్​’ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన విషయం తెలిసిందే. విడదలకు ముందు ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన ఈ సినిమా.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.ఇది ఇలా ఉండ‌గా పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖులతో కూడిన జాబితాను టైమ్స్ విడుదల చేసింది. రాజమౌళి, షారుక్‌తోపాటు మరికొంతమందికి ఈ లిస్ట్‌లో చోటు దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌, హాలీవుడ్‌ తార ఏంజెలా బాసెట్‌, ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ, న్యాయనిర్ణేత పద్మలక్ష్మి తదితరులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వంద మంది వ్యక్తులు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఎస్‌ఎస్‌ రాజమౌళి .. షారుక్‌ ఖాన్ అరుదైన ఘనత సాధించారు. 2023కు గానూ ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్ రిలీజ్‌ చేసిన 100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2023’ (100 most influential people of 2023) జాబితాలో చోటు దక్కించుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి వీరిద్దరికే ఈ అవకాశం దక్కడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement