Monday, March 4, 2024

పునీత్‌ ఆ విషయం చెప్పలేదు: రాజమౌళి

కన్నడ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన సేవలు అందరికి ఈ మధ్యే తెలిశాయి. రీల్ హీరోగానే కాకుండా ఎనో సేవ కార్యక్రమాలతో ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్నాడు. దాదాపు 1500 మందికి పైగా పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. వీటితోపాటు పలు స్కూళ్లు, అనాధాశ్రమాలు, వృద్దాశ్రమాలు, గోశాలలు కట్టించారు. అయితే, ఈ విషయాలు ఆయన చనిపోయన తర్వాతే వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి పునీత్ మరణంపై స్పందించారు.

పునీత్ చాలా మందికి సాయం చేసిన‌ప్ప‌టికీ ఎవ్వ‌రికీ చెప్ప‌లేద‌ని రాజమౌళి అన్నారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాతే ఆయ‌న సేవ‌ల గురించి అంద‌రికీ తెలిసింద‌ని చెప్పారు. సాధారణంగా ఎవ‌రైనా  చిన్న సాయం చేసినా ప్రపంచానికి తెలిసేలా ప్ర‌చారం చేసుకుంటార‌ని, కానీ పునీత్ రాజ్‌ కుమార్ మాత్రం అలా కాదన్నారు. నాలుగు ఏళ్ల క్రితం తాను బెంగళూరుకు వచ్చినప్పుడు పునీత్ రాజ్‌కుమార్‌ను కలిశానని. త‌న‌ను  కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారని చెప్పారు. త‌న‌తో ఆయ‌న‌ సరదాగా మాట్లాడారని, ఒక స్టార్‌తో మాట్లాడుతున్నాననే భావనే త‌నకు కలగలేదని రాజ‌మౌళి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement