Tuesday, May 21, 2024

ప్రిస్కిప్ష్రన్‌ లేకుండా అమ్మకాలు.. శాంపిల్స్‌ నూ వదలట్లేదుగా..

దేవరకొండ, (ప్రభన్యూస్‌) : సీజనల్‌ వ్యాధుల కంటే ప్రమాదకరంగా మారిన మెడికల్‌ మాఫియా వ్యాపారం కొంతమంది ప్రాణాలను హరిస్తోంది. గతంలో కంటె ఈ సారి సీజనల్‌ వ్యాధులు ఎక్కువ కావడంతో ఇదే అదనుగా భావించిన మెడికల్‌ మాఫియా చెలరేగిపోతున్నారు. ప్రిస్కిప్ష్రన్‌ లేకుండానే మెడికల్‌ షాపుల వారు హైపవర్‌ మందులను అంటగడుతూ బాధితుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టు-కొని ఔషధ తయారీదారులు విడుదల చేస్తున్న జనరిక్‌ మందులను సైతం మెడిక్‌ షాపుల వారు ఎమ్మార్పీ ధరలకే విక్రయిస్తున్నారు. ఆయా షాపుల్లో జనరిక్‌ మందులను సైతం స్టాండర్డ్‌ కంపెనీల మందుల ధరలకు అమ్మతున్న షాపులు చాలానే ఉన్నాయి. ఫ్రీ శాంపిల్స్‌ మందులను సైతం అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారు.

డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకిన వారు తమ లక్షణాలు చెప్పడంతో వారికి మెడికల్‌ షాపుల వారు ఏ డాక్టర్‌ ప్రిస్కిప్ష్రన్‌ లేకుండా మందులు ఇస్తూ రోగుల ప్రాణాలపైకి తెస్తున్నారు. అటువంటి రోగులంతా బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారు కావడంతో మెడికల్‌ షాపుల వారికి వరంగా మారింది. అదే విధంగా దేవరకొండ నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గంగా పేరొంది. గిరిజనులు, పేదవారు ఆడపిల్లలను సాకలేక వదిలేసిన ఘటనలు చాలనే చోటుచేసుకున్నాయి. మందులను ఎవరికి అమ్మిన వివరాలను కూడా నమోదు చేయడం లేదన్న ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. దీంతో మందులు కొని ప్రాణాలు పోతే ప్రశ్నించే వీలుండదు కనుక మెడికల్‌ షాపుల వారు దర్జాగా వ్యవహరిస్తున్నారు. మెడికల్‌ షాపుల దోపిడీని అరికట్టాలని, ఈ వ్యవహారాలపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement