Saturday, April 27, 2024

Breaking: హైదరాబాద్​లో వర్షం.. కూల్​ అయిన సిటీ వెదర్​

రుతుపవనాల రాకతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సిటీపై కమ్ముకున్న మబ్బులు క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సన్​సిటీ, మణికొండ, అమీర్‌పేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, బీఎన్‌రెడ్డి, ఇంజాపూర్‌, హయత్‌నగర్ ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురుస్తున్నట్టు సమాచారం.

కాగా, రాగల రెండు మూడు రోజుల్లో హైదరబాద్​లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వెల్లడించింది.

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వానలు కురుస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల, రాజాపూర్‌, బాలానగర్‌, మిడ్జిల్‌, నవాబ్‌పేట, రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్‌, ఆమన్‌గల్‌ మండలాల్లో వర్షం కురిసింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌, నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో భారీ వర్షం పడినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement