Friday, April 26, 2024

రాధేశ్యామ్ నుండి సంచారి టీజ‌ర్

డైరెక్ట‌ర్ రాధాకృష్ణ తెర‌కెక్కిస్తోన్న చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రంలో హీరోగా ప్ర‌భాస్, హీరోయిన్ గా పూజాహెగ్డే న‌టిస్తున్నారు. ఈ చిత్రం నుండి సంచారి టీజ‌ర్ ను రిలీజ్ చేశారు. ఈ నెల 16న పూర్తి పాట విడుద‌ల కానుంది. కాగా కృష్ణం రాజు సమర్పణలో గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలీజ్ సమయం దగ్గర పడుతూండటంతో ..చిత్రం ప్రమోషన్స్ వేగం పెంచారు. సౌత్ లాంగ్వేజ్ సాంగ్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా… హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. ‘సంచారి’ పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా… అనిరుధ్ రవిచందర్ ఆలపించారు.

‘చలో… చలో… సంచారి! చల్ చలో… చలో! చలో… చలో… సంచారి! చల్ చలో… చలో… కొత్త నేలపై’ అంటూ ఈ పాటను కృష్ణకాంత్ (కెకె) రాశారు. రాధేశ్యామ్ చిత్రంలో ప్ర‌భాస్ విక్రమాదిత్య పాత్రలో క్లాస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే, ప్రేరణ పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. 1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రేక్షకులకు తప్పకుండా మెప్పింస్తుందని ఈ చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మ‌రి ఏ మేర‌కు విజ‌యాన్ని అందుకుంటుందో చూడాలి.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement