Monday, April 29, 2024

‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్ట బొమ్మ పూజ హెగ్డే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. రాధా కృష్ణ కుమార్ డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. జనవరి 14న రిలీజ్ కావాల్సిన ‘రాధేశ్యామ్’ మూవీ.. కరోనా కేసులు పెరగడంతో వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది ఈ సినిమా యూనిట్. ఈ సినిమాను మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో వాయిదా పడిన సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ కూడా రిలీజ్ కు రెడీ అయింది. పాన్ ఇండియాన్ మూవీకి రూపొందిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రొమాంటిక్ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement