Friday, May 3, 2024

Breaking : ముంబైలో నైట్ క‌ర్ఫ్యూ ఎత్తివేత – మాస్క్ లు త‌ప్ప‌నిస‌రి

క‌రోనా ఉథృతి త‌గ్గుతోంది. దాంతో ప‌లు రాష్ట్రాల్లో విధించిన క‌రోనా ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్నాయి రాష్ట్ర ప్ర‌భుత్వాలు. కాగా మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబ‌యిలో కూడా నైట్ క‌ర్ఫ్యూని విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ముంబైలో క‌రోనా కేసులు త‌గ్గుతోన్న నేప‌థ్యంలో నైట్ క‌ర్ఫ్యూని ఎత్తివేశారు. క‌రోనా ఆంక్ష‌ల‌ను కూడా స‌డ‌లించారు. ఈ మేర‌కు నేటి నుంచే న‌గ‌రంలో రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, థీమ్ పార్క్ లకు అనుమ‌తి ఇచ్చారు. కానీ 50 శాతంతో సామ‌ర్థ్యంతోనే న‌డిపించాల‌ని నిబంధ‌న‌ను పెట్టారు. అలాగే బీచ్ ల‌తో పాటు పార్కులు, ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను గ‌తంలో లాగే తెరుచుకోనున్నాయి. అయితే అంద‌రూ మాస్క్ ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పెట్టుకోవాల‌ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement