Monday, May 6, 2024

Radhe Shyam: థియేటర్లలో రాధేశ్యామ్.. సినిమా ఎలా ఉందంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న  రాధే శ్యామ్ సినిమా నేడు(మార్చి 11) ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. థియేటర్ల వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రాధేశ్యామ్ సందడి చేస్తోంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాన్ స్టార్ గా మారిన ప్రభాస్ నుంచి వచ్చిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెర‌కెక్కించారు. మూవీని యూర‌ప్‌లో జార్జియా, ఇట‌లీ వంటి దేశాల్లో షూటింగ్ చేశారు. ప్రభాస్- పూజ హెగ్డే జంటగా వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోస్ ద్వారా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బ్యూటీఫుల్ లవ్ స్టోరిగా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. తమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్,ఫెర్ఫామెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.

https://twitter.com/powerstarpk007/status/1502031477495664662
Advertisement

తాజా వార్తలు

Advertisement