Thursday, May 2, 2024

స‌డెన్ గా ట‌ర్న్ అయిన భారీ ట్రాలీ-నుజ్జ‌యిన రెండు కార్లు-ముగ్గురు మృతి

అతి వేగంగా వెళ్తోన్న భారీ ఇసుక ట్రాలీ స‌డెన్ గా ట‌ర్న్ తీసుకుని అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. దాంతో ఆ వాహ‌నం కింద రెండు కార్లు ఇరుక్కుపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో ఓ కారు నుజ్జు నుజ్జ‌యింది.కారులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రోవాహ‌నం ఆ ట్రాక్ కింద ఇరుక్కు పోయింది. అందులో ఉన్నవారు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పంజాబ్‌లోని జలంధర్‌లోని మహిల్‌పూర్ చౌక్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావ‌డంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెల‌కొంది. ఈ ఘోర ప్రమాదం సీసీటీవీ కెమెరాలో రికార్డ‌యింది. పోలీసులు విడుద‌ల చేసిన వీడియోలో హైవేపై వెళ్తున్న 18-చక్రాల భారీ వాహ‌నం ఒక్కసారిగా మలుపు దగ్గర టర్న్ తీసుకుంది. ఇసుక‌ను ఓవ‌ర్ లోడ్ చేసుకుని వేగంగా వెళ్తున్న భారీ వాహ‌నం వేగంగా స‌డెన్ గా డ్రైవ‌ర్ ట‌ర్న్ చేయ‌డంతో.. బ్యాలెన్స్ కోల్పోయి ఆ ట్రక్ బోల్తాపడింది. ఈ క్ర‌మంలో ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. అందులో ఉన్న ఇసుక మొత్తం రోడ్డుపై ప‌డింది. ఆ భారీ వాహ‌నం కింద ఓ కారు ప‌డి నుజ్జునుజ్జు అయ్యింది. ఆ కారులో ఉన్న దంపతులు, వారి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. రెండో కారు కూడా పూర్తిగా డ్యామేజ్ అయితే అందులో ఉన్నవారంతా తృటిలో ప్రాణాల‌తో తప్పించుకున్నారు. కానీ, వారికి కూడా తీవ్ర గాయాల‌య్యాయి. వెంట‌నే స్థానికులు కారులో ఉన్న వ్య‌క్తుల‌ను బ‌య‌ట‌కు తీసి.. ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రమాదం జరిగిన తర్వాత ట్రాలీ డ్రైవర్ మేజర్ సింగ్ పరారయ్యాడు. ర్యాష్ డ్రైవింగ్ సహా పలు ఆరోపణల కింద ట్రాలీ డ్రైవర్ మేజర్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement