Saturday, April 27, 2024

పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. పునీత్ రాజ్ కుమార్ మామ రేవనాథ్( 78) గుండెపోటుతో మరణించారు. రేవనాథ్ పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని తండ్రి. పునీత్ చనిపోయిన నాటి నుంచి రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. అనంతరం ఆయన్ని ఆసుపత్రిలో జాయిన్ చేయగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు. ఇప్పటికే భర్త పునీత్ రాజ్ కుమార్ మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న అశ్విని.. ఇప్పుడు తండ్రి కూడా మరణించడంతో తీవ్ర విషాధంలో మునిగిపోయింది.

కాగా, పునీత్ రాజ్‌కుమార్ మరణించిన కొన్ని నెలల తర్వాత ఆయన మామగారు గుండెపోటుతో మరణించడంతో అతని కుటుంబం మళ్లీ విషాదంలో మునిగిపోయింది. రేవనాథ్ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా, అకా NHAIకి చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆయన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకాకు చెందినవారు. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ మాదిరిగానే, రేవనాథ్ కూడా ఆయన మరణానంతరం తన కళ్లను దానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement