Saturday, May 18, 2024

KCR Vision – తెలంగాణ వెలుగుల జిగేల్ ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఏళ్ళ తరబడి పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో దేశం నివ్వెర పోయేలా ఫలితాలు సాధించామని, వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడమే లక్ష్యంగా రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి లక్ష్యాలను చేరుకున్నామని, అదే స్ఫూర్తితో పథకాలు, కార్యక్రమాల విశిష్టతను ప్రజల్లో చాటాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. పండగ వాతావ రణంలో పదేళ్ళ రాష్ట్ర ప్రగతి కార్యక్రమాలు వాడవాడలా మారుమ్రోగాలన్నారు. చేసింది చెప్పుకుంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా, వైభవంగా దశాబ్ది ఉత్సవాలు జరగా లని, ఆ దిశగా ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయా లని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల నిర్వహణ, కార్యాచరణ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారంనాడు డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిం చారు. అవతరణ దినోత్సవాల్లో భాగంగా నిర్వహించే అధికారిక కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించాలో ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, పదేండ్ల రాష్ట్ర ప్రగతిని చాటు-తూ దశాబ్ది ఉత్సవాలు గొప్పగా సాగాలని, అన్నిస్థాయిల్లో ప్రజా ప్రతినిధులకు, అధికార యంత్రాంగం విధిగా పాల్గొనాలని అన్నారు. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లె పల్లెన ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని ఆదేశించారు. 21 రోజుల పాటు- నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాల ప్రారంభ వేడుకలను జూన్‌ 2న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించాలని, తాను ముఖ్య అతిథిగా హాజరై సమాజానికి సందేశం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.


దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల విద్యుత్‌ను రైతాంగానికి ఉచితంగా, నిరంతరాయంగా అందిస్తున్నామని, ఆ ఘనతను సమాజంలో అన్ని వర్గాలకు తెలిసేలా చాటాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. ”ఈ ప్రగతి ఎంతగానో కష్టపడితే తప్ప సాధ్యం కాలేదు. ఇవే విషయాలను ప్రజలకు వివరించాలి. గత పాలకుల నిర్లక్ష్య వైఖరితో కరెంటు- లేక తెలంగాణలో ఎక్కడ చూసినా ఇన్వర్టర్లు, కన్వర్టర్లే కనిపించేవి. వంగిపోయిన కరెంటు- స్తంభాలు ప్రమాదాలకు కారణమవుతుండేవి. వేలాడే కరెంటు- తీగలు ప్రజల ప్రాణాలను హరించేవి. ఇండ్ల మీది నుంచే విద్యుత్‌ లైన్లు పోయినా నాడు పట్టించుకునే దిక్కే లేకుండేది. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగునా దృఢంగా నిలిచిన కరెంటు- స్తంభాలు, విద్యుత్‌ను నిరంతరాయంగా ప్రసారం చేస్తున్న నాణ్యమైన కరెంటు- వైర్లు, అడుగడుగునా ట్రాన్స్‌ఫార్మర్లు ప్రజలకు అందుబాటు-లోకి వచ్చాయి. గత పాలనలో విస్మరించబడిన విద్యుత్‌ ఉత్పాదన, ప్రసార వ్యవస్థలను దార్శనికతతో, పట్టు-దలతో పటిష్టపరుచుకోవడం ద్వారానే విద్యుత్‌ విజయం సాధ్యమైంది. ఈ విషయం తెలంగాణ ప్రజలకు అనుభవంలోకి వచ్చింది” అని సీఎం అన్నారు. విద్యుత్‌ రంగం మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం పటిష్టపరిచిన వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ప్రతి రంగంలో సాధించిన అభివృద్ధిని పేరు పేరునా ప్రజలకు పలు ప్రసార మాధ్యమాలు, మార్గాల ద్వారా చేరవేయాలన్నారు. స్వరాష్ట్ర సాధన ఫలాలను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలతో ఈ మూడు వారాల పాటు- మమేకం కావాలని అభిప్రాయపడ్డారు. వారి భాగస్వామ్యంతో పల్లె నుంచి పట్నం దాకా దశాబ్ది ఉత్సవాలను ఆటాపాటలతో పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని సీఎం పునరుద్ఘాటించారు.


సచివాలయంలో ఉత్సవాల ఏర్పాట్లపై సూచనలు
అదే సందర్భంలో జూన్‌ 2 ప్రారంభం నాడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్వహించే వేడుకలను డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన నేపథ్యంలో సచివాలయంలో స్టేజి ఏర్పాటు- సహా పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, జాతీయ జెండా ఎగురవేయడం తదితర అధికార కార్యక్రమాలు నిర్వహణకు సంబంధించి సీఎం కేసీఆర్‌ చర్చించారు. ఆహ్వానితులకు పార్కింగ్‌ సౌకర్యం, అతిథులకు తేనీటి విందు ఏర్పాటు- వంటి కార్యక్రమాలను ఎక్కడ, ఎట్లా నిర్వహించాలో వివరిస్తూ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు సహా రాష్ట్రవ్యాప్తంగా 21 రోజుల పాటు- నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాల ఏర్పాట్ల గురించి చర్చించారు.


ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు హరీష్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శేరి సుభాష్‌ రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి, సీఎం ప్రధాన సలహాదారు సోమేష్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌ రావు, డీజీపీ అంజని కుమార్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సి.వి. ఆనంద్‌, సీఎం సెక్రటరీలు స్మితా సబర్వాల్‌, భూపాల్‌ రెడ్డి, ఆర్‌అంబ్‌బి ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాస రాజు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, ఐఅండ్‌పీఆర్‌ కమిషనర్‌ అశోక్‌ రెడ్డి, జాయింట్‌ డైరక్టర్‌ జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement