Saturday, May 18, 2024

జనసేన ఆవిర్భావ సభకు సన్నాహాలు.. 12 కమిటీలకు బాధ్యతలు

అమరావతిలో జరిగే జనసేన ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్​ జనసేనాని పవన్​ కల్యాణ్​ కమిటీలను ప్రకటించారు. మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో ఈ నెల 14న సభ జరగనుంది. దీనికి గాను 12 కమిటీలు ఏర్పాటు చేశారు. ఆవిర్భావ సభ ఆద్యంతం ఏర్పాట్లను ఈ కమిటీలు పర్యవేక్షించనున్నాయి. సుహృద్భావ వాతావరణంలో సభను విజయవంతం చేసేలా ఈ కమిటీలు కృషి చేస్తాయని పార్టీ అధినేత తెలిపారు. కాగా, సభ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. స్థానికంగా, దూర ప్రాంతాల నుంచి వచ్చే జనసేన శ్రేణులు, నాయకులు, వీరమహిళలు, జనసేన అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా కమిటీలు జాగ్రత్త వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కమిటీ సభ్యులకు తెలిపారు.

జిల్లాల సమన్వయ కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే..

పంతం నానాటి, ముత్తా శశిధర్, నేమూరి శంకర్ గౌడ్, పెదపూడి విజయ్ కుమార్,  జి. ఉదయ్ శ్రీనివాస్ (బన్ని వాసు), సుందరపు విజయ్ కుమార్, వడ్రాణం మార్కండేయ బాబు..

ఆహ్వాన కమిటీలో..

- Advertisement -

టి. శివశంకర్,చేగోండి సూర్యప్రకాశ్, సయ్యద్ జిలానీ, బేతపూడి విజయ్ శేఖర్, డా.ఎర్రంకి సూర్యారావు, పసుపులేటి శ్రీనివాస్..

లైజన్ కమిటీలో..

బొలిశెట్టి సత్యనారాయణ, ఈవన సాంబశివ ప్రతాప్, గంటా స్వరూప, గెడ్డం మహలక్ష్మి ప్రసాద్​లకు అవకాశం కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement