Sunday, May 5, 2024

ప్రాణహిత పుష్కరాలు: త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తజనం

ప్రాణహిత పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. దీంతో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. స్నానాలు చేసే ఘాట్లు జనంతో కిక్కిరిశాయి. గత 12 రోజులుగా పుష్కరాలు సాగుతున్నాయి. నేటితో పుష్కరాలు ముగియనుండటంతోపాటు పాఠశాలలకు వేసవి సెలవులు కూడా ప్రకటించడంతో పిల్లాపాపలతో పుష్కర స్నానాలకు భారీగా తరలి వస్తున్నారు. వేకువ జామున నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కాళేశ్వరం త్రివేణి సంగమానికి చేరుకొని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట, మహారాష్ట్రలోని నగరం, సిరోంచ, త్రివేణి సంగమ పుష్కర ఘాట్లు భక్తులతో కిక్కిరిశాయి. కాళేశ్వరంలోని త్రివేణి సంగమ తీరం భక్తజనంతో నిండిపోయింది. పలు చోట్ల భక్తులు పుష్కర స్నానాలు ఆచరించడానికి బారులు తీరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement