Sunday, April 28, 2024

అద్దెకు బాయ్ ఫ్రెండ్ -టామ్ బాయ్ పేరుతో పోర్ట‌ల్

అద్దెకు బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడ‌ని టామ్ బాయ్ పేరుతో స్టార్ట్ చేసిన ఒక పోర్ట‌ల్ అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. అయితే ఈ స్టార్టప్ అందించే సేవల గురించి స్పష్టత ఇస్తున్నారు దీని నిర్వాహకులు. మానసిక సమస్యలు.. ఒంటరితనంతో బాధపడే వారికి సానుకూల మాట‌లు చెప్పటం.. ధైర్యం ఇవ్వటం.. కౌన్సెలింగ్ చేయటానికి ఇప్పటికే చాలానే వెబ్ సైట్లు ఉన్నప్పటికీ.. తాము ఇచ్చే సేవలు వాటికి కాస్తంత భిన్నమని చెబుతున్నారు. లవ్ లో ఫెయిల్ అయిన అమ్మాయిలకు తమ టాయ్ బాయ్ తో అందించే సేవలు సాంత్వన కలిగిస్తాయట‌. తమ పోర్టల్ ద్వారా అమ్మాయిల సమస్యలు సానుభూతితో వినటం.. వారి మానసిక ఆందోళనను దూరం చేసేందుకు సహకారం అందిస్తామంటున్నారు. అద్దెకు బాయ్ ఫ్రెండ్ అంటూ ఆకర్షణీయమైన ప్రకటనతో అందరిని ఆకర్షిస్తున్న ఈ స్టార్టప్ పై పలువురు మండిపడుతున్నారు. ఇదెక్కడి పోయేకాలం అంటూ తిట్టి పోస్తున్న వారు కూడా లేకపోలేదు. వివాదాస్పదంగా మారిన ఈ స్టార్టప్ పై కర్ణాటక ప్రభుత్వం ఏ రీతిలో రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ కొత్త స్టార్టప్ ని బెంగళూరుకు చెందిన కొందరు టెకీలు స్టార్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement