Saturday, November 2, 2024

Drunk & Drive: మందుబాబులకు గుడ్ న్యూస్.. పోలీసులకు ఆ ఆధికారం లేదు!

మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టబడిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మద్యం సేవించిన డ్రైవ్ చేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు వారి వాహనాలను సీజ్ చేస్తూ వచ్చారు. అయితే, ఇకపై మందుబాబుల వాహనాలను సీజ్ చేసే అవకాశం లేదు. వాహనాల జప్తుకు సంబంధించిన పిటిషన్ పై విచారించిన తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో మద్యం సేవించి పట్టుబడిన వారి వాహనాలను సీజ్‌ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా మద్యం సేవించి పట్టుబడిన వారి వెంట మద్యం సేవించనివారేవరైనా ఉంటే వారికి వాహనాన్ని అప్పగించాలని సూచించింది. మద్యం తాగిన వారి వెంట ఎవరూ లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులను పిలిచి వాహనం ఇవ్వాలని పేర్కొంది. ఎవరూ రాకపోతే వాహనం పీఎస్‌కు తరలించి తర్వాత అప్పగించాలని వెల్లడించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో​ స్వాధీనం చేసుకున్న వాహనాన్ని ఒరిజనల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ పాటు గుర్తింపుకార్డు చూపిన వ్యక్తికి స్వాధీనం చేయాలని ఆదేశించింది. తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించే పోలీస్‌ అధికారులపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.

కాగా, ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహనాలను స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ సుమారు 43కు పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించారు. వాహన డ్రైవర్‌ మద్యం సేవించారన్న కారణంగా ఆ వాహనాన్ని సీజ్‌ చేసే అధికారం పోలీసు అధికారులకు లేదు. ఒకవేళ వాహనదారుడిని ప్రాసిక్యూట్‌ చేయా లని పోలీసులు భావిస్తే వాహనాన్ని సీజ్‌ చేసిన 3రోజుల్లోగా సంబంధిత కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement