Thursday, April 25, 2024

విశాఖ స్టీల్‌ప్లాంట్‌‌ను ప్రైవేటీకరణ చేయవద్దని విజ్ఞప్తి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రెండు సార్లు లేఖలు రాశారని పీఎంవో కార్యాలయం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 20న ఒకసారి, మార్చి 10న మరోసారి ప్రధానికి చంద్రబాబు రెండు లేఖలు రాశారని, అవి పీఎంవోకు చేరాయని వాటికి సమాధానం కూడా ఇచ్చామని సమాచార హక్కు చట్టం కార్యకర్త రవికుమార్‌కు వచ్చిన సమాధానంలో ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈ లేఖలకు గడువులోగా జవాబును పంపాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్ విభాగానికి సూచించామని పేర్కొంది.

కాగా తాజాగా పీఎంవో కార్యాలయం సమాధానంతో విశాఖ ఉక్కుకు వ్యతిరేకంగా చంద్రబాబు ఏ విధమైన అడుగులూ వేయలేదని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది. ఇక తన లేఖలో విశాఖ ఉక్కును ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రైవేటీకరణ కాకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు ప్రధానిని కోరారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలను తక్షణమే విరమించాలని కూడా సదరు లేఖలలో చంద్రబాబు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement