Sunday, May 5, 2024

Fare Crisis: దేశంలో ధరల పెంపుపై జంతర్​మంతర్​ వద్ద ఆందోళన.. పాల్గొన్న ప్రధాని సోదరుడు ప్రహ్లాద్​ మోదీ

దేశంలో ధరల పెంపును నిరసిస్తూ ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్​ మోదీ మంగళవారం ఢిల్లీలో ఆందోళన నిర్వహించారు. ఆలిండియా ఫెయిర్‌ ప్రైస్‌ షాప్‌ డీలర్స్‌ ఫెడరేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ న్యూఢిల్లీలో పలు డిమాండ్‌లు ప్రభుత్వం ముందు ఉంచుతూ ధర్నాకు చేపట్టారు. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ (ఎఐఎఫ్‌పిఎస్‌డిఎఫ్) సభ్యులతో పాటు ప్రహ్లాద్ జంతర్ మంతర్ వద్ద బ్యానర్లు పట్టుకుని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

AIFPSDF ప్రతినిధి బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక మెమోరాండాన్ని సమర్పించిందని, తమ మనుగడ కోసం, తమ దీర్ఘకాల డిమాండ్లను పరిష్కరించాలని అందులో తెలియజేశామన్నారు ప్రహ్లాద్​ మోదీ. ప్రస్తుత జీవన వ్యయం దారుణంగా మారిందని,  దీంతో దుకాణాల నిర్వహణ కూడా ఇబ్బంది అవుతోందన్నారు. పెరిగిన ఖర్చులతో తమ మార్జిన్‌లో కిలోకు 20 పైసలు అనేది ఓ క్రూరమైన జోక్​ అని ఆయన అభివర్ణించారు. తమకు  పలు అంశాలపై ఉపశమనం కల్పించి, ఆర్థిక కష్టాలను తీర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని ప్రహ్లాద్​ మోదీ అన్నారు.

బుధవారం ఏఐఎఫ్‌పీఎస్‌డీఎఫ్‌ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని, దాని ఆధారంగా తమ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని ప్రహ్లాద్​ మోదీ పేర్కొన్నారు. బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ కాబోతున్నామని తెలిపారు  AIFPSDF జాతీయ ప్రధాన కార్యదర్శి బిశ్వంభర్ బసు.

ఇక.. బియ్యం, గోధుమలు, పంచదారపై నష్టపరిహారం చెల్లించాలని, అలాగే ఎడిబుల్‌ ఆయిల్‌, పప్పులు రేషన్​ షాపుల ద్వారా మాత్రమే సరఫరా చేయాలని AIFPSDF డిమాండ్‌ చేస్తోంది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ రేషన్ మోడల్​ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కూడా ఈ సంఘం డిమాండ్ చేసింది. ఇంకా, జమ్మూ, కాశ్మీర్‌తో సహా అన్ని రాష్ట్రాలకు బకాయి ఉన్న అన్ని మార్జిన్లను వెంటనే రీయింబర్స్ చేయాలని సంఘం సభ్యులు అన్నారు.

సరైన ధరల దుకాణాల ద్వారా ఎడిబుల్ ఆయిల్, పప్పులు, ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని కూడా తాము డిమాండ్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల న్యాయమైన ధరల దుకాణం డీలర్లు బియ్యం, గోధుమల కోసం ప్రత్యక్ష సేకరణ ఏజెంట్లుగా పనిచేయడానికి అనుమతించాలి. తమ డిమాండ్లను టిఎంసి ఎంపి పార్లమెంట్​లో లేవనెత్తారు. అయితే.. తమ డిమాండ్లు నెరవేరే దాకాఈ నిరసనలు కొనసాగుతాయని చెప్పారు సంఘం కార్యదర్శి బసు.

Advertisement

తాజా వార్తలు

Advertisement