Friday, May 3, 2024

బ్రెయిన్​డెడ్​ పేషెంట్లకు పందిగుండె మార్పిడి.. జెనోట్రాన్స్​ప్లాంట్స్​ సక్సెస్

యూఎస్​ పరిశోధనా బృందం ఓ కొత్త ప్రయోగం చేసి మానవుల లైఫ్​ని పెంచే పనిలో సక్సెస్ అయ్యింది. జూన్​, జులైలో బ్రెయిన్​డెడ్​ అయిన వారికి జన్యుపరంగా మార్పు చెందిన పంది గుండెలను విజయవంతంగా మార్పిడి చేసింది. జెనోట్రాన్స్ ప్లాంట్స్ అని పిలిచే ఈ ఆపరేషన్​ని జూన్ 16, జులై 6 వ తేదీల్లో NYU లాంగోన్ టిస్చ్ హాస్పిటల్‌లో నిర్వహించారు.

తమ పరిశోధనలు అవయవ కొరతను పరిష్కరించడానికి, ప్రాణాంతక గుండె జబ్బులున్న వారికి ప్రత్యామ్నాయంగా ఎంతో ఉపయోగపడతాయని.. క్లినికల్ ప్రోటోకాల్‌ను డెవలప్​ చేయడానికి ఈ పరిశోధనలు మేలు చేస్తాయని వైద్య పరిశోధనా బృందం చెబుతోంది. అయితే.. ఈ మార్పిడి శస్త్రచికిత్సలు చాలా గంటలు జరిగాయి. గుండె పనితీరును మూడు రోజులు పర్యవేక్షించారు. కాగా, ఏ ఇతర అవయవంలోనూ దీనికి సంబంధించిన తిరస్కరణ సంకేతాలు కనిపించలేదన్నారు డాక్టర్లు. అంతేకాకుండా పోస్ట్-ట్రాన్స్ ప్లాంట్ మెడిసిన్స్​తోనే, అదనపు యాంత్రిక సపోర్ట్​ లేకుండా హార్ట్​ పనిచేసినట్టు తెలిపారు.

సాధారణంగా పనిచేసే మానవేతర అవయవంతో మాత్రమే తమ ప్రత్యామ్నాయ పరిశోధన సాగిస్తున్నామని, మానవుల గుండె మార్పిడి పరిస్థితులను  సరళతరం చేయడమే తమ లక్ష్యం అని సర్జికల్ డైరెక్టర్ నాడర్ మొజమి అన్నారు. జినోట్రాన్స్ ప్లాంటేషన్‌ తో ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కొంటున్న వారికి కొత్త అవయవాల అమర్చేందుకు ఇక ఇబ్బందులేవీ ఉండవని NYU లాంగోన్‌లోని గుండె మార్పిడి వైద్య డైరెక్టర్ అలెక్స్ రేయెంటోవిచ్ తెలిపారు.  ఇంకో విషయం ఏమిటంటే.. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) పంది నుండి మానవునికి అవయవ మార్పిడి కోసం మానవ క్లినికల్ ట్రయల్స్ ను ఆమోదించడాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement